అల్బేనియా-గ్రీస్ సరిహద్దులోని ఒక గుహలో పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును కనుగొన్నారు. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గూడులో రెండు జాతులకు చెందిన దాదాపు 1,11,000 సాలీళ్లు కలిసి నివసిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇంత పెద్ద ఎత్తున సాలీళ్లు ఉమ్మడిగా గూడు నిర్మించడం చాలా అరుదైన విషయమని పరిశోధకులు తెలిపారు.