ప్రియురాలిని చంపిన యువకుడు

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త, పిల్లలను వదిలేసి రాజస్థాన్‌కు చెందిన యోగేష్ చౌదరితో గత ఏడాదిన్నరగా 'లివ్-ఇన్' సంబంధంలో ఉంటున్న కుంకుమ్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు యోగేష్ చౌదరినే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఈ హత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕