సోషల్ మీడియా ఫేమ్, హిందీ బిగ్‌బాస్-16 కంటెస్టెంట్ అబ్దు రొజిక్‌ను దొంగతనం కేసులో దుబాయ్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. తజికిస్థాన్‌కు చెందిన అబ్దు సింగర్‌గానూ పాపులర్. 2022లో అబుదాబీలో జరిగిన ఐఫా వేడుకల్లో హిందీ పాటలు పాడి ఫేమ్ సంపాదించుకున్నాడు. దీంతో అదే ఏడాది జరిగిన హిందీ బిగ్‌బాస్-16లో అవకాశం వచ్చింది. కాగా అబ్దుకు కేసులు కొత్తేం కాదు. గతేడాది మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.