మోదీ మాస్క్‌తో దొంగతనం.. సీసీటీవీ వీడియో వైరల్

రాజస్థాన్‌లోని భిల్‌వారాలో ఓ దొంగ వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. ప్రధాని మోదీ మాస్క్ ధరించి మొబైల్ షాపులోకి చొరబడి దొంగతనం చేశాడు. సీసీటీవీ కెమెరాల్లో తన అసలు ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. షాపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ, సుమారు 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను అపహరించి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్