కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. సోమవారం జూన్ 23 నాటికి దేశవ్యాప్తంగా 4,425 కొవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండగా, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఏపీలో 34, తెలంగాణలో 9 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉందని, రోగులు ఇంటివద్దే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.