ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) 641 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యూడీషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ లేదా పదో తరగతి అర్హతగా నిర్ణయించారు. వయసు 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత ఉన్నవారు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలకు https://dsssb.delhi.gov.in వెబ్సైట్ను చూడవచ్చు.