రక్తదానం చేసిన అనంతరం దేహంలో కొత్త రక్తకణాల ఉత్పత్తి ప్రారంభం కావడానికి సుమారు నాలుగు రోజులు పడుతుంది. దీని వలన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. గొంతు, పేగులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను ఎదుర్కొనే అవకాశాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. కేలరీలు తగ్గించడంలో సహాయపడటంతోపాటు, ఆరోగ్య స్థితిని తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.