హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఎటువంటి సుంకాలు, బీమా ఖర్చులు లేదా ఇతర రుసుములూ వసూలు చేయమని ఇరాన్ హామీ ఇచ్చిందని, ఒకవేళ ఇది తప్పుడు సమాచారమైతే వారితో చర్చలను నిలిపివేస్తామని ట్రంప్ తెలిపారు.