ఎన్నిలకు ఇంకా మూడేళ్లు ఉంది.. ఆలోపు ఏదైనా జరగొచ్చు: MLA

TG: మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. 'ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు కూడా ఆ పార్టీవైపే ఉంటారు. అధికార పార్టీకి ఓటేస్తేనే ఉపయోగం అని నేనూ నమ్ముతా' అని అన్నారు. ఎవరేం అనుకున్నా గద్వాల నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉందని, ఆలోపు ఏదైనా జరుగొచ్చు అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్