TG: ప్రభుత్వం తీసుకొచ్చిన HILTP పాలసీలో పెద్ద కుట్ర కోణం ఉందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం నాచారం ఇండస్ట్రియల్ ఏరియాను 700 ఎకరాలతో నిర్మించిందని పేర్కొన్నారు. అయితే పొల్యూషన్ చేసే కంపెనీలను తరలించాలనే సాకుతో ప్రభుత్వం పొల్యూషన్ చేయని కంపెనీలను కూడా తరలించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం రూ.8 కోట్ల ధర పలికే ఎకరం భూమిని రూ.3 కోట్లకే ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందని మండిపడ్డారు.