బడ్జెట్‌లో తెలంగాణకు గుడ్ న్యూస్ ఉండబోతోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర బడ్జెట్‌ 2026లో తెలంగాణకు గుడ్‌న్యూస్‌ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ దేశ హితం, ప్రజల సంక్షేమం, జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉంటుందన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు కేంద్రం అంగీకరించిందని, మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. అనేక సంస్కరణలతో అన్ని వర్గాలకు న్యాయం చేసే బడ్జెట్‌ అవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్