తెలంగాణ నేపథ్య కుటుంబ కథా చిత్రం ‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. దీనిపై చిత్ర నిర్మాత బన్నీ వాస్ స్పందిస్తూ, కథను బట్టే టైటిల్ ఉంటుందని, ప్రస్తుత వివాదం నేపథ్యంలో టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దర్శకుడు వాస్తవ సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నారని, ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలని, విభేదాలు తీసుకురాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.