ఒడిశా పూరీలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయానికి పెళ్లికాని జంటలు కలిసి వెళ్లకూడదనే ప్రచారం ఉంది. స్థానిక కథనాల ప్రకారం, అలా వెళితే వారి బంధంలో సమస్యలు వస్తాయని, వివాహం కూడా జరిగే అవకాశాలు తగ్గుతాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం, ఓసారి రాధ, జగన్నాథుని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడిని చూడటానికి పూరీ వచ్చింది. అయితే.. ఆలయంలోకి ఆయన భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని రాధను అక్కడి పూజారులు లోపలికి అనుమతించలేదట. దీంతో పెళ్లికాని వారు జంటగా వస్తే.. వారు విడిపోతారు అని రాధ శాపం ఇచ్చిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.