TG: రాష్ట్ర ప్రభుత్వం 'మహాలక్ష్మి పథకం' కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ వార్త SMలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని TG ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందని తెలిపింది.