ఏపీకి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో TG ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే బనకచర్లపై GRMB, CWC, EAC అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై.. చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది.