TG: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లు కడుపునిండా అన్నం తింటుంటే BRS నేతలు చూడలేకపోతున్నారని విమర్శించారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ మోసాలు, స్కాంలు బయటపెడుతామని చెప్పారు. కానీ ప్రెస్‌మీట్‌లో పస లేదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు.