కర్ణాటక తరహాలో మా ప్రభుత్వంలో పవర్‌ షేరింగ్‌ ఏమీ లేదు: భట్టి

కర్ణాటక ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వంలో పవర్‌ షేరింగ్‌ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో భట్టి చిట్‌చాట్‌‌లో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి టీం వర్క్‌ చేస్తున్నామని చెప్పారు. BRS నేతల మాటలు మితిమీరిపోయాయని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదని.. జనాల్లోకి వెళ్లడం లేదని చెప్పారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్