‘వారణాసి’కి సీక్వెల్ లేదు: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి తన రాబోయే చిత్రం ‘వారణాసి’కి సీక్వెల్ ఉండదని స్పష్టం చేశారు. విదేశాల్లో జరిగిన ‘యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన, ఈ చిత్రాన్ని ఒకే భాగంలో పూర్తి చేస్తున్నామని, దీనికి సీక్వెల్ అవసరం లేదని తెలిపారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తవుతుందని, డిసెంబర్ నుండి ప్రమోషన్స్ మొదలవుతాయని సమాచారం. హైదరాబాద్ లోని భారీ సెట్స్ లో జులై 6 నుండి తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7న అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్