TG: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీలకు సామాజిక న్యాయం అందలేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుందని, వారిని వెట్టిచాకిరీకే పరిమితం చేసి చదువు, రాజ్యాధికారానికి దూరం చేసి మోసం చేసిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దేశం మేల్కొందని, బీసీ కులగణన చేపట్టి చట్టసభల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.