కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ వార్తల్లో నిజం లేదు: లాయర్ (VIDEO)

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ కోసం కోర్టులో మెమో మాత్రమే దాఖలు చేశారని, సీజ్ చేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. నోటీసులు అందిన తర్వాత కోర్టులో చట్టపరంగా కౌంటర్ దాఖలు చేస్తామని, ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕