పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో తప్పులేదు: నిత్యామీనన్

సినీ నటి నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వివాహం, వ్యక్తిగత జీవితంపై బోల్డ్‌గా స్పందించారు. “పిల్లలు కావాలంటే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి లేకుండానే పిల్లలను కనడంలో తప్పులేదు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం” అని నిత్యామీనన్ పేర్కొన్నారు. పెళ్లి జీవితం మొత్తం కాదని, తన స్వేచ్ఛ తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. నిజమైన ప్రేమ దొరికితే పెళ్లి చేసుకుంటానని, లేదంటే కూడా జీవితం ఆగిపోదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్‌లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్