జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వీరాపూర్ పంచాయతీలో సర్పంచి పదవికి జనరల్ మహిళలకు కేటాయించగా, దిండిగాల గంగు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 2014లో కూడా సర్పంచిగా గెలుపొందిన గంగు, ఈసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లోని కొన్ని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వార్డులకు కూడా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది. అధికారుల పరిశీలన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది.