దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: TRS చీఫ్ కవిత

TG: సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాల మధ్య డూప్లికేట్ ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని TRS చీఫ్ కవిత డిమాండ్ చేశారు. ముఖ్యంగా HYDలో ఉన్న లక్షలాది మందికి ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాలని ఆమె కోరారు. బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించారని కవిత మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే కేవలం 808 ఓట్లే ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సంఘం సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్