జనసేనతో పొత్తు ఉండదు: బీజేపీ చీఫ్ రామచందర్ రావు

TG: జనసేన పార్టీతో పొత్తుపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పరిణామాల ఆధారంగానే కూటమిగా ఏర్పడ్డామని స్పష్టం చేశారు. ఒకవేళ పొత్తు అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణలో బలంగా ఉన్నామని.. అధిష్ఠానానికి కూడా ఇదే చెబుతామని అన్నారు.

సంబంధిత పోస్ట్