పెళ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే.. మళ్లీ ఆగస్టు 15 వరకు లేవ్: పండితులు

జులై నెలలో వివాహాది శుభకార్యాలకు కొద్ది రోజులే అనుకూల ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపారు. జులై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలు శుభకార్యాలకు అనువైనవిగా పేర్కొన్నారు. ఆషాఢమాసం, గురుమూఢం కారణంగా ఆగస్టు 15 వరకు శుభ ముహూర్తాలు ఉండవని, అనంతరం శ్రావణ మాసంలోనే వివాహాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో అందుబాటులో ఉన్న ముహూర్తాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుండగా, కళ్యాణ మండపాలు, క్యాటరింగ్ సేవలు, బంగారం, వస్త్ర దుకాణాల్లో వ్యాపారం జోరుగా సాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్