ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో చాలామంది తమ ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్స్‌కు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువ తీసుకుంటున్నారు. అయితే వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు, అనేక రకాల రోగాలను కూడా దూరం చేస్తాయి.