చింతగింజలను వ్యర్థాలుగా భావించి చాలా మంది పారేస్తుంటారు. కానీ కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి వీటిలో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, నీటిలోని మైక్రోప్లాస్టిక్స్ ను వేరు చేసే గుణం వీటిలో ఉంది. వీటిని వేయించి, పొడి చేసుకుని తేనెతో తీసుకోవచ్చు. అయితే, గర్భిణులు, అనీమియా బాధితులు వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవాలి. చింతగింజల పొడిలో తేనె లేదా రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసి గాయాలకు రాస్తే త్వరగా తగ్గుతాయట. అంతేకాదు, దీన్ని ఫేస్ ప్యాక్ గానూ వాడొచ్చు.