అమ్మాయిల వివాహ వయసు పెంచితే సమాజంలో వచ్చే మార్పులు ఇవే!

అమ్మాయిల వివాహ వయసును 18 నుండి 21 ఏళ్లకు పెంచడం వల్ల సమాజంలో, ముఖ్యంగా మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతానికి ఇంటర్‌తోనే చదువు ఆగిపోయి, పెళ్లిళ్లు జరుగుతుండగా, కొత్త చట్టంతో ఉన్నత విద్యకు, డిగ్రీ, పీజీ చదివేందుకు అవకాశం లభిస్తుంది. తక్కువ వయసులో తల్లులవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గి, ఆరోగ్యకరమైన మాతృత్వం సాధ్యమవుతుంది. ఆర్థికంగా పరాధీనత తగ్గి, చదువుతో ఉద్యోగం సాధించి, ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ చట్ట సవరణ లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదిగేందుకు బలమైన పునాది కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్