వ్యవసాయంలో నేల సారం కీలకం. వేసవిని సద్వినియోగం చేసుకుంటే భూమి సారాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎండల వల్ల హానికర సూక్ష్మజీవులు తగ్గుతాయి. అదే టైంలో మల్చింగ్ ద్వారా ఎండుటాకులు, గడ్డి, వరి పొట్టుతో మట్టిని కప్పితే తేమ నిలిచి నీటి వినియోగం తగ్గుతుంది. జనుము, ధైంచా వంటి పచ్చిరొట్ట పంటలను దున్నడం వల్ల సహజ నత్రజని లభిస్తుంది. జీవామృతం, పశువుల ఎరువు, కంపోస్ట్ వాడటం ద్వారా నేల నిర్మాణం మెరుగుపడుతుంది. వేసవిలో లోతుగా దున్నడం, పంట మార్పిడి పాటిస్తే వర్షాకాలంలో మంచి దిగుబడులు సాధ్యమవుతాయి.