డార్క్ చాక్లెట్స్ తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడతాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. మూడ్ మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.