Vivo V80లో అదిరిపోయే ఫీచర్లు ఇవే

కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V80 మార్కెట్లోకి రానుంది. ఇందులో 50MP ZEISS కెమెరాలు, 100x జూమ్, 7,200mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. OriginOS 7తో వచ్చే ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు ధర ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి. 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ రంగులు దీని ప్రత్యేకతలు. 7,200mAh బ్యాటరీతో 14 గంటల నావిగేషన్, 39.5 గంటల వీడియో ప్లేబ్యాక్ సాధ్యమవుతుంది. 90W ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕