తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి మరోసారి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, రెండో అభ్యర్థిగా డాక్టర్ పుంజాల వినయ్ కుమార్‌ను నామినేట్ చేసినట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వినయ్ కుమార్ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. హై కమాండ్ రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్.