మహిళలు మధ్యాహ్నానికే నీరసించిపోవడానికి, ఉదయం లేవగానే అలసటగా అనిపించడానికి పని ఒత్తిడితో పాటు రక్తహీనత , హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, విటమిన్ B12, D3, డీహైడ్రేషన్ వంటి అంతర్గత సమస్యలు కారణమవుతున్నాయి. సరైన నిద్ర, మానసిక ఒత్తిడి కూడా శక్తి స్థాయిలను తగ్గిస్తాయి. ఆహారంలో మార్పులు, తగినంత నిద్ర, శారీరక శ్రమతో శక్తిని తిరిగి పొందవచ్చు. తీవ్రమైన నీరసం ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.