‘మగధీర’ తర్వాత రామ్ చరణ్ 2010లో ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాల్సి ఉంది. ఏప్రిల్ 30, 2010న ప్రారంభమైన ఈ చిత్రానికి చిరంజీవి క్లాప్ కొట్టారు. హీరోయిన్ల మార్పు, బడ్జెట్ పెరగడం, చిరంజీవి స్క్రిప్ట్ మార్పుల సూచన, పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అర్జున్ కోచ్‌గా నటించాల్సి ఉన్నా, సినిమా ముందుకు వెళ్లలేదు.