జుట్టు రాలడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే

జుట్టు రాలడం ఒక్కసారిగా మొదలైనట్లు అనిపించినా.. ముందుగా కొన్ని చిన్న సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దువ్వెన, దిండు లేదా స్నానం చేసేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ జుట్టు కనిపించడం, పోనీటైల్‌ పలుచగా అనిపించడం, హెయిర్ పార్టింగ్‌ వెడల్పుగా కనిపించడం వంటివి ప్రారంభ సంకేతాలు కావచ్చు. అలాగే హెయిర్‌లైన్‌ నెమ్మదిగా వెనక్కి వెళ్లడం, తలపై భాగంలో జుట్టు సాంద్రత తగ్గడం కూడా గమనించాలి. ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు, అనారోగ్యం, కొన్ని మందులు వంటి కారణాలు జుట్టు రాలడానికి దారితీయొచ్చు. అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలినా, ప్యాచ్‌లుగా జుట్టు తగ్గినా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕