పర్సులో ఈ వస్తువులుంటే ప్రమాదమే!

మీ పర్సులో బ్యాంక్ కార్డులు, ఆధార్ వంటి వ్యక్తిగత గుర్తింపు కార్డులు, పాత రశీదులు, పాస్‌పోర్ట్, ఇంటి తాళాలు వంటివి ఉంచుకోవడం ప్రమాదకరం. ఒకవేళ పర్సు పోతే, ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయవచ్చు, మీ గుర్తింపును దుర్వినియోగం చేయవచ్చు. విదేశాలకు వెళ్లేటప్పుడు తప్ప పాస్‌పోర్ట్ పర్సులో ఉంచకూడదు. మీతో పాటు ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒక గుర్తింపు కార్డు, మీ పేరు, బ్లడ్ గ్రూప్, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు రాసిన కాగితం లేదా విజిటింగ్ కార్డును పర్సులో ఉంచుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్