కారు డోరు తీసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కారు రోడ్డు పక్కన ఆపినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కుడివైపు డోరు తెరవకూడదు. కుడివైపు నుంచి దిగాల్సిన పరిస్థితి వస్తే డ్రైవర్‌ వైపు ఉండే అద్దం నుంచి వెనుక వచ్చే వాహనాలను గమనించాలి. వెనుక సీట్లో కూర్చున్నవారు డ్రైవర్‌ వైపు ఉండే అద్దంలో చూసి వాహనాలు, పాదచారులు రావడం లేదని నిర్ధారించిన తరువాతే విండో అద్దం దించి చేతితో సంజ్ఞ చేసి డోరు తెరవాలి. కారులో పిల్లలుంటే కుడివైపు నుంచి దిగొద్దని చెప్పాలి.

సంబంధిత పోస్ట్