నోటిపూత, కడుపుబ్బరం, కీళ్ల జబ్బులు, మలబద్ధక సమస్యలకు కొత్తిమీర చెక్ పెడుతుంది. నరాల వ్యవస్థను, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యను నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు, ఐరన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కొత్తిమీరలోని సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఎ-విటమిన్ కళ్లకు మేలు చేస్తుంది.