30 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు తప్పనిసరి: నిపుణుల సూచన

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో 30 ఏళ్లు దాటిన వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మెటబాలిజం తగ్గడం, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం వల్ల డయాబెటిస్, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ప్రీడయాబెటిస్, థైరాయిడ్ అసమతుల్యత, ఫ్యాటీ లివర్ వంటివి లక్షణాలు లేకుండానే ప్రారంభమవుతాయి. అందుకే ఈ వయసులో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, లివర్ పరీక్షలు, థైరాయిడ్, విటమిన్ D, B12, ఐరన్ లోపాల నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. బరువుతో పాటు శరీర నిర్మాణం, కొవ్వు, కండరాల నిష్పత్తిని కూడా గమనించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్