కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నడు: హరీశ్

TG: కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ఓర్వలేక రేవంత్ నీళ్లు ఆపుతున్నాడని BRS నేత హరీశ్ ఆరోపించారు. 'కృష్ణా నదిలోకి నీళ్లొచ్చి 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు స్టార్ట్ చేయలేదు. మేము ప్రశ్నిస్తే మోటార్లు ఆన్ చేశారు. KCR మీద, నా మీద కోపం ఉంటే మా మీద కేసులు వెయ్యి. మేడిగడ్డ కుంగిన 2 పిల్లర్లు రిపేర్ చేస్తే 6 నెలల్లో అంతా మంచిగా అవుతుంది. కళ్ల ముందు నీళ్లు పోతున్నాయి కానీ రైతులకు నీళ్లు ఇవ్వట్లేదు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్