AP: శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లలో ఆదివారం ఓ మహిళ హోంగార్డు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గోరంట్ల PSలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళ కూల్ డ్రింక్‌లో రసాయన ద్రావణం కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. పోలీసు డ్రైవర్లు మైను, షఫీ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇది గమనించిన పోలీసులు బాధిత మహిళను గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు.