కెరీర్ ప్రారంభంలో 4-5 సినిమాల్లో న్యూడ్ గా నటించాల్సి వచ్చిందని, కథకు అవసరం లేకున్నా ఇంటిమేట్ సీన్లలో నటిస్తానని కొందరు భావించారని హీరోయిన్ రాధికా ఆప్టే విమర్శించారు. సరైన కారణం లేకుండానే కోస్టార్లను ముద్దు పెట్టుకోవాలని, బ్రా, ఇన్నర్‌వేర్ లో యాక్షన్ సీన్లు చేయాలని అడిగేవారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు పరిస్థితి కాస్త మారిందని, సన్నివేశం ఎందుకో వివరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.