మల్లన్నను చంపేందుకు వచ్చారు: సిబ్బంది

TG: 60 మంది జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా ఆఫీస్‌పై దాడి చేశారని Qన్యూస్ సిబ్బంది తెలిపారు. తీన్మార్ మల్లన్నను చంపేందుకు వచ్చారని ఆరోపించారు. గన్‌మెన్‌పై దాడి చేసి ఆఫీస్‌లో ఎవరు కనబడితే వారిని కొట్టారని అన్నారు. అందుకే గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. తర్వాత మల్లన్నపైనా దాడి చేసి బీభత్సం సృష్టించారన్నారు. బీసీ ఉద్యమం లేకుండా చేయాలనే జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, కవితపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్