ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో ఒక పెళ్లి వేడుకలో చికెన్ లెగ్ పీస్‌ల కోసం గొడవ పడ్డారు. బిర్యానీలో తగినన్ని లెగ్ పీస్‌లు లేవని వరుడి తరఫు బంధువులు గొడవకు దిగారు. వివాదం ముదరడంతో ఇరువర్గాలు కుర్చీలను విసురుకుంటూ భోజనశాలను ధ్వంసం చేశాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.