మాకంటే వారి వద్దే శక్తిమంతమైన ఆయుధాలు: పాక్‌ మంత్రి

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ నేషనల్ అసెంబ్లీలో బలోచ్‌ రెబెల్స్‌ వద్ద అమెరికా ఆయుధాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సైన్యం వద్ద కూడా లేని నైట్‌ విజన్‌ డివైజ్‌లు, రైఫిళ్లు వంటి అధునాతన ఆయుధాలు రెబెల్స్‌ వద్ద ఉన్నాయని, వీటి విలువ 2 మిలియన్ల డాలర్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆయుధాలు అఫ్గానిస్థాన్‌ నుంచి వస్తున్నాయని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి రెబెల్స్‌ను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్