TG: కులాంతర వివాహానికి చేశాడని ఓ వ్యక్తిని దారుణంగా చంపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగింది. ఎల్లంపల్లివాసి చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని పది రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాడు. చంద్రశేఖర్ వివాహానికి అన్న రాజశేఖర్ సహకరించాడని భావించిన యువతి బంధువులు ఈ నెల 12న రాజశేఖర్‌ను మాట్లాడదామని పిలిచి కొట్టి చంపారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.