వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని వెయ్యి రోజులుగా నరకం: కేటీఆర్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ 1000 రోజులను 'క్రిమినల్ వేస్ట్' అని, పాలన 'ప్రజా పీడన' అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం అబద్ధాలు, అజ్ఞానం, అరాచకం, అవినీతితో నిండిపోయిందని, అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. 100 రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి.. 1000 రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్