నాగరిక జీవనం పేరుతో నగరాల్లో సహజీవనం, వివాహానికి ముందే గర్భధారణ, ప్రేమ వివాహాలు సాధారణమవుతున్న నేపథ్యంలో… ఈ తరహా పరిస్థితులు తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలని చైనా గ్రామస్థులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో లిన్‌కాంగ్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో గ్రామ పెద్దలు సమావేశమై ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ నియమాల ప్రకారం, పెళ్లి కాకుండా కలిసి నివసిస్తే ప్రతి సంవత్సరం 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు) జరిమానా విధిస్తారు. పూర్తి వివరాలు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.