అర్థరాత్రి బార్‌లో దొంగల హల్ చల్‌.. వీడియో

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ దర్బార్ బార్‌లోకి అర్ధరాత్రి సమయంలో చొరబడ్డ దొంగలు భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. బార్ మెయిన్ గేటు తాళాన్ని విరగ్గొట్టి, లోపలి గదిలోని బీరువా తాళాలను పగులగొట్టి సుమారు రూ.4 లక్షల నగదును అపహరించినట్లు బార్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన తీరు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

సంబంధిత పోస్ట్

✕
✕