మేడారం జాతరలో దొంగల హల్చల్!

మేడారం జాతరకు వచ్చిన భక్తులు దొంగల బారిన పడుతున్నారు. మొబైల్స్, బంగారు చైన్లు, వెండి పట్టీలు, నగదును దొంగలు క్షణాల్లో కొట్టేస్తున్నారు. మేడారం గద్దెలకు సమీపంలో రెండో గేటు వద్ద ఓ వృద్ధుడు ఫోన్ దొంగిలిస్తుండగా భక్తుడు పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. అతని వద్ద రెండు ఫోన్లు, చార్జర్ దొరికాయి. జంపన్న వాగు వద్ద రూ.10వేలు, బంగారు చైన్ దొంగిలించబడ్డాయని అన్నదమ్ములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల ముఠా తిరుగుతోందని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్